![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా - పుల్ట అని నాగార్జున చెప్తే ఏమో అనుకున్నాం కానీ ఈ కాన్సెప్ట్ ని ఒక డ్రామా క్రియేట్ చేసి అద్భుతంగా చెప్పారు బిగ్ బాస్ మేకర్స్. ఇక ఈ న్యూ బిగ్ బాస్ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. చూస్తేనే నవ్వొచ్చిదిలా ఉంది. రాధా- రమేష్ క్యారెక్టర్స్ ని సృష్టించి చిన్న స్కిట్ ప్లే చేసింది. లోయలో పడిపోయిన తన లవర్ రమేష్ ని కాపాడడం కోసం రాధ కొండ అంచుకు వచ్చి తన చున్నీ ఇచ్చి కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇంతలో రాధకు తుమ్మొస్తుంది. దాంతో రాధ చున్నీ వదిలేయడంతో రమేష్ అంత ఎత్తు నుంచి కిందకి పడుతూ ఉంటాడు. ఇంతలో నాగార్జున వచ్చి.. ‘ఇలాంటి క్లైమాక్స్‌లు బోలెడు చూశాం కదా.. ఎండింగ్ మార్చేద్దాం.. ఇది అంతం కాదు.. ఆరంభం’ అని చిటికె వేసేసరికి రమేష్.. లోయలో పడిపోకుండా గాల్లో తేలుతూ కనిపిస్తాడు. ఇంతలో తుమ్ము నుంచి తేరుకున్న రాధ.. ఎక్కడున్నావ్ రమేష్ అంటూ చూసేసరికి గాల్లో తేలుతుంటాడు.
అప్పుడు హోస్ట్ నాగార్జున బొంగరాన్ని గాల్లోకి వేస్తూ అక్కడికి వచ్చినప్పుడు ది ఎండ్ కార్డు కూడా రివర్స్ లో తిరిగిపోతాయి "ఎవరి ఊహకి అందని సీజన్.. బిగ్ బాస్ 7. అంతా ఉల్టా పుల్టా’ అని బిగ్ బాస్ టైటిల్ గురించి చెప్పేసారు. సెప్టెంబర్ 3 న బిగ్ బాస్ స్టార్ట్ కాబోతోందంటూ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం బాగా జరుగుతోంది. ఇక ఈ షో కొత్త రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనేదే ఫుల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే కొన్ని సీజన్స్ మరీ బోరింగ్ గా కాంట్రోవర్సిగా మారేసరికి ఈసారి టోటల్ గా షో మొత్తాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేసాం అని నాగార్జున చెప్పడంతో ఆడియన్స్ లో కూడా హైప్ పెరిగిపోయింది. ఐతే ఇందులో అమ్మాయిలూ అబ్బాయిలుగా మారిపోతారా...అమ్మాయిలు ఆడే ఆటల్ని అబ్బాయిలతో ఆడిస్తారా..ఏంటో కొంచెం కూడా క్లూ మాత్రం ఇవ్వలేదు. కానీ కుడి ఎడమైతే అని చెప్తుంటే ఇలా ఉంటుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
![]() |
![]() |